ప్రసన్న ఇంట్లో కలసిన కారుమూరి -కారుమూరి కి పుష్పగుచ్ఛము – రీజనల్ కో-ఆర్డినేటర్ గా కారుమూరి
నల్లపరెడ్డికి మాజీ మంత్రి కారుమూరి సంఘీభావం
-ప్రసన్న ఇంట్లో కలసిన కారుమూరి
-కారుమూరి కి పుష్పగుచ్ఛము
- రీజనల్ కో-ఆర్డినేటర్ గా కారుమూరి యాంకర్ పార్ట్ : మాజీ మంత్రి నల్లపరెడ్డికి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు..సంఘీభావం తెలిపారు.నెల్లూరు నగరంలోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇటీవల నెల్లూరు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి నివాసంపై వేమిరెడ్డి దంపతుల ముఖ్య అనుచరులు, తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు దాడి జరిపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వర రావు , శాసన మండలి సభ్యులు, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , నెల్లూరు నగరంలోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటికి చేరుకొని ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మీయంగా మాట్లాడి, పరిస్థితులను తెలుసుకొని, దాడిని తీవ్రంగా ఖండించారు..
నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ గా నూతనంగా నియమితులైన కారుమూరి వెంకట నాగేశ్వర రావు గారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు..