విచారణకు ముగ్గురు హాజరు -అనిల్, వీరచలపతిరావులు గైర్హాజరు
ఐదుగురు వైసీపీ నేతలకు నోటీసులు…
- విచారణకు ముగ్గురు హాజరు
-అనిల్, వీరచలపతిరావులు గైర్హాజరు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నల్లపరెడ్డితోపాటు మరో ఇదుగురిపై కోవూరు పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. వీరిలో ముగ్గురు విచారణకు హాజరు కాగా…మాజీ మంత్రి అనిల్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరిచలపతిరావులు గైర్హాజరయ్యారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఓ కళ్యాణ మండపంలో ఈనెల ఏడో తేదీ జరిగిన వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోవూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నతో పాటు మరో ఐదు మందికి నోటీసులు అందించారు. 26వ తేదీ కోవూరు సర్కిల్ స్టేషన్ కి హాజరుకావాలని సిఐ సుధాకర్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలు మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి. నీలపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి అత్తిపల్లి అనూప్ రెడ్డి లకు సర్కిల్ ఆఫీసులో విచారణ కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వీరిలో పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నీలపరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డిలు మాత్రమే విచారణకు హాజరయ్యారు. అనివార్య కారణాల వల్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వీరి చలపతిరావు గైర్హాజరయ్యారు. హాజరైన వారిని కోవూరు సర్కిల్ ఆఫీస్ లో సీఐ సుధాకర్ రెడ్డి విచారణ చేపట్టారు. వైసిపి నాయకులకు సంఘీభావం తెలుపుతూ నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు….