జిల్లా ను “డ్రగ్ ఫ్రీ” జిల్లా గా మార్చడమే ధ్యేయం
ఇన్చార్జి ఎస్పీ దామోదర్
మాదకద్రవ్యాల నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు
డ్రగ్స్ వద్దు బ్రో…
- జిల్లా ను “డ్రగ్ ఫ్రీ” జిల్లా గా మార్చడమే ధ్యేయం
- ఇన్చార్జి ఎస్పీ దామోదర్
- మాదకద్రవ్యాల నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు
డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాలన్న ధ్యేయంగా జిల్లా పోలీసులు పని చేస్తున్నారు. నెల్లూరులోని పలు కళాశాలలు, పాఠశాలలో డ్రగ్స్ వద్దు బో అనే నినాదాలతో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పోలీసులు పిలుపునిస్తున్నారు.
జిల్లా ను “డ్రగ్ ఫ్రీ” జిల్లా గా మార్చడమే ధ్యేయంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని…ఇన్చార్జి ఎస్పీ దామోదర్ తెలిపారు. ఇన్చార్జి ఎస్పీ, అడిషన్ ఎస్పీల సూచనల మేరకు…నెల్లూరులోని పలు కళాశాలలు, పాఠశాలలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే, ఎక్సైజ్, డ్రగ్స్ విభాగాల సమన్వయంతో “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత భవిష్యత్తు అంధకారం అవుతోందని… సరదాగా మొదలయ్యే ఈ అలవాటు.. చివరికి బానిసగా మార్చుకుంటుందని చెప్పారు. ఎటువంటి అసాంఘీక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, డ్రగ్స్ అమ్మినా, వినియోగించే వారి గురించి డయల్ 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.