హామీలు..అభివృద్ధి ని పక్కన పెట్టి

ప్రశ్నిస్తున్నందుకే వైఎస్ఆర్సిపి నాయకులు పై కేసులు

ముత్తుకూరులో కూటమి ప్రభుత్వంపై కాకాని పూజిత ఫైర్

హామీలు..అభివృద్ధి ని పక్కన పెట్టి…

  • ప్రశ్నిస్తున్నందుకే వైఎస్ఆర్సిపి నాయకులు పై కేసులు
    -ముత్తుకూరులో కూటమి ప్రభుత్వంపై కాకాని పూజిత ఫైర్

ప్రభుత్వం హామీలను …అభివృద్ధినీ… పక్కన పెట్టి కక్షపూరితంగా …కుట్రలతో రాజకీయాలు చేస్తూ… ముందుకు వెళ్తుందని కాకాని పూజిత రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో బాబు షూరిటీ…మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ గండవరం సుగుణ, జడ్పిటిసి సభ్యుడు బందల వెంకటసుబ్బయ్య, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి ,తదితరులతో కలిసి పూజిత రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను…ప్రత్యేకంగా స్క్రీన్ పై ప్రసారం చేసి చూపించారు. అనంతరం కూటమి మానిఫెస్టో ను గుర్తు చేద్దాం అంటూ…క్యూ ఆర్ కోడ్ తో ముద్రించిన పోస్టర్లను నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా కాకాని పూజిత రెడ్డి మాట్లాడుతూ… తన తండ్రి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు పెట్టారని అన్నారు.ఇంత జరుగుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్త ఏ ఒక్కరు భయపడకుండా తమ వెంట నడుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెంగారెడ్డి, అశోక్ రెడ్డి ,కోదండరామిరెడ్డి, సర్పంచులు హారికా రెడ్డి, కృష్ణవేణి , ఎంపీటీసీలు నవీద్ భాష వెంకటేశ్వర్లు,అగ్ని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *