ముగిసిన ప్రసన్నకుమార్‌రెడ్డి విచారణ -డీఎస్పీ, సీఐలు అడిగిన అన్ని ప్రశ్నలకూ ఆన్సర్ ఇచ్చా -రాజకీయాల్లో విమర్శలుంటాయ్.. ప్రతి విమర్శలుంటాయ్ కేసులు పెట్టుకుంటూ పోతే.. కోర్టులు, జైళ్లూ సరిపోవు -మా.. ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు -మీడియాతో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి
40 ప్రశ్నలు..
2 గంటలపాటు విచారణ..!
-ముగిసిన ప్రసన్నకుమార్‌రెడ్డి విచారణ
-డీఎస్పీ, సీఐలు అడిగిన అన్ని ప్రశ్నలకూ ఆన్సర్ ఇచ్చా
-రాజకీయాల్లో విమర్శలుంటాయ్.. ప్రతి విమర్శలుంటాయ్
కేసులు పెట్టుకుంటూ పోతే.. కోర్టులు, జైళ్లూ సరిపోవు
-మా.. ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు
-మీడియాతో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముందస్తు బెయిల్‌కు హైకోర్టుకు వెళ్లిన ప్రసన్నకుమార్‌రెడ్డికి హైకోర్టు డైరెక్షన్‌తో కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేయడం.. దానిపై నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి ముందు ప్రసన్నకుమార్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ విచారణ మధ్యాహ్నాం సుమారు ఒకటిన్నరకు ముగిసింది. మొత్తం 40 ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ ప్రసన్నకుమార్‌రెడ్డి సమాధానాలు చెప్పారు. విచారణ అనంతరం అక్కడే ప్రసన్న మీడియాతో మాట్లాడారు. ఆయా వివరాలను వెళ్లడించారు. డీఎస్పీ, సీఐలు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చానన్నారు. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజమని.. వీటిపై కేసులు పెట్టుకుంటూ పోతే.. కోర్టులు, జైళ్లూ సరిపోవన్నారు. కోవూరు ఎమ్మెల్యేను తాను వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లు తనపై కేసు పెట్టడం జరిగిందని.. ఈ కేసు కోర్టులో ఉంది.. ఇంతకన్నా తాను ఎక్కువ మాట్లాడకూడదని ప్రసన్న పేర్కొన్నారు. రేపనేది ఒకటుందని.. ఎల్లకాలం వారే అధికారంలో ఉండరని.. మళ్లీ మేము అధికారంలోకి వస్తామని.. మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదు.. వైసీపీకీ, నాయకులు, మా అధినాయకులు జగన్ మోమన్‌రెడ్డికి అన్నీ గుర్తున్నాయని.. సమయం వచ్చినప్పుడు చెప్తామంటూ హెచ్చరించారు. మా ఇంటిపై జరిగిన దాడి విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని.. మేము.. నేదురుమల్లివాళ్లం 50 ఏళ్లు రాజకీయం చేశాం.. ఏ నాడూ ఇళ్లపై దాడులు చేసుకోలేదని ఈసందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు.