మహిళా కానిస్టేబుల్ నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నం
ప్రియడు మోసం చేశాడని…
-మహిళా కానిస్టేబుల్ నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లా కుప్పం మండలం మార్వాడ గ్రామంలో యువతి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు… కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గోపాల్ కుమార్తె ప్రశాంతి (25) ప్రియుడు కుప్పం నియోజకవర్గ మార్వాడ గ్రామానికి చెందిన వాసును కలిసేందుకు గ్రామానికి వచ్చినట్లు తెలిసింది. హఠాత్తుగా ప్రియుడు వాసు ఇంటి ఎదుట ప్రశాంతి వెంట తెచ్చుకున్న పెట్రోల్ తనపై పోసుకొని నిప్పంటించుకుందన్నారు. గ్రామస్తులు మంటలను ఆర్పి హుటాహుటిన కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం కుప్పం పిఈఎస్ ఆసుపత్రికి తరలించారు. యువతి కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ప్రియుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.