పార్లపల్లి భూములకు విముక్తి…

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి -సుపరిపాలనలో తొలి అడుగులో పర్యటించిన ఎమ్మెల్యే

పార్లపల్లి భూములకు విముక్తి…

  • సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
    -సుపరిపాలనలో తొలి అడుగులో పర్యటించిన ఎమ్మెల్యే

గత పాలకులు, అధికారుల తప్పిదం కారణంగా నిషేధిత భూముల జాబితాలో చేర్చిన 760ఎకరాలు పార్లపల్లి భూములకు విముక్తి కల్పించినట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పార్లపల్లిలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో సోమిరెడ్డి మాట్లాడుతూ…. గత ప్రభుత్వంలో రీ – సర్వే పేరుతో పట్టా భూములను 22Aలో చేర్చారని… అందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారాని ఆవేదన వ్యక్తం చేశారు. మండలం లోని పార్లపలి, మర్రిపల్లి భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడం జరిగిందన్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే ఇరిగేషన్ అధికారులు గత పాలనలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని తెలిపారు. రైతులకు అవసరమైన నీటి పారుదల కాలువలను కూటమి పాలనలో రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేశామన్నారు. తాను ఓడినా పొదలకూరు సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానన్నారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాలి పెద పెంచలయ్య తోపాటు 40 కుటుంబాల వారు సోమిరెడ్డి సమక్షంలో వైసీపీ ని వీడి టీడీపీ లో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ అయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ హవాలో కూడా పార్లపల్లి టీడీపీ కి అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమం లో మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, మండల తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, ఏ ఎం సీ వైస్ చైర్మన్ వెంపులూరు అరుణ, టీడీపీ నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, అక్కెమ్ సుధాకర్ రెడ్డి, బోగోలు భాస్కర్ రెడ్డి, కలిచేటి ప్రభాకర్ రెడ్డి, కడివేటి హరికృష్ణ, పార్లపల్లి సర్పంచ్ గూడూరు ప్రసన్న, ఉపసర్పంచ్ అన్నలూరు చెన్నకృష్ణమ నాయుడు, మాజీ సర్పంచ్ గూడూరు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *