మనీస్కాం విచారణలో డీఎస్పీ, సీఐలను తొలగించాలి..!

71 మంది పోలీసులు కావలి మనీ స్కాంలో బాధితులుగా ఉన్నారు. – మనీ స్కాంలో ఎమ్మెల్యే, డీఎస్పీ, సీఐ లపై అనుమానాలు – కావలి రూరల్ సీఐ తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఐడోంట్ కేర్ – కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మనీస్కాం విచారణలో డీఎస్పీ, సీఐలను తొలగించాలి..!

  • 71 మంది పోలీసులు కావలి మనీ స్కాంలో బాధితులుగా ఉన్నారు.
  • మనీ స్కాంలో ఎమ్మెల్యే, డీఎస్పీ, సీఐ లపై అనుమానాలు
  • కావలి రూరల్ సీఐ తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఐడోంట్ కేర్
  • కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కావలి పట్టణంలో వెలుగు చూసిన షేర్ మార్కెట్ మనీ స్కీమ్ స్కాం పై కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మనీ స్కాంలో బాధితులకు న్యాయం జరుగుతుందన్న పరిస్థితి కానరావడం లేదన్నారు. డబ్బులు కట్టిన వారిలో 71 మంది పోలీసు సిబ్బందే ఉన్నారని, వీరిలో ఒక కానిస్టేబుల్ ఇప్పటికే ఆత్మహత్య చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖ ఉద్యోగులు బాధితులుగా ఉన్నారన్నారు. ఒక్క కావలిలోనే 100 కోట్లు కట్టి ఉన్నారని, ఇక కాకినాడ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బాధితులు వందల సంఖ్యలో ఉన్నారన్నారు. ఈ కేసును కావలి డీఎస్పీ, రూరల్ సీఐ తేల్చలేరని, వీరిపైనే అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *