ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కొనసాగుతున్న విచారణ
రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు
విచారణకు హాజరైన ప్రసన్న…
- ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కొనసాగుతున్న విచారణ
- రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రసన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రసస్నకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఉదయం నెల్లూరు డీఎస్పీ కార్యాలయానికి విచ్చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రసన్నను పోలీసులు విచారిస్తున్నారు. మాజీ మంత్రి ప్రసన్నకు మద్దతుగా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.