ప్రాణాలు తీసుకుంటాం_ _జీవనోపాధి కోల్పోతాం_ _వలసే గతి_ _భాస్కరపురం గ్రామస్తులు
మా ఉరిని స్మశానం చేయొద్దు
-ప్రాణాలు తీసుకుంటాం
-జీవనోపాధి కోల్పోతాం
-వలసే గతి
-భాస్కరపురం గ్రామస్తులు
..
నెల్లూరు జిల్లా , వరికుంటపాడు మండలం భాస్కరపురం పంచాయతీ జంగంరెడ్డి పల్లి గ్రామంలో మైనింగ్ లీజు అనుమతుల కొరకు ఏర్పాటు చేసిన ప్రజాసేకరణ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ పూజిత పాల్గొన్నారు.
వరికుంటపాడు మండలం భాస్కరపురం పంచాయతీ జంగం రెడ్డి పల్లి గ్రామంలో మైనింగ్ లీజు అనుమతుల కొరకు ఏర్పాటు చేసిన ప్రజా సేకరణ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ పూజిత , పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్ కుమార్, వరికుంటపాడు తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు. జంగంరెడ్డి పల్లి గ్రామస్తులు మైనింగ్ జరపవద్దని అలా జరిపితే ప్రాణాలు తీసుకుంటామని, అనుమతులు ఇస్తే తమ జీవన ఉపాధిని కోల్పోతామని అధికారుల ముందు కన్నీరు మున్నీరయ్యారు.. మైనింగ్ పేరుతో కొండను పెకలించే కార్యక్రమం చేస్తున్నారని జీవాల మీద ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు జీవనాధారాన్ని పోయి గత్యంతరం లేక ఇక్కడ నుండి తరలిపోయే పరిస్థితి నెలకొంటుందని సర్పంచ్ దిలీప్ కుమార్ అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు