కుతంత్రాలు తెలియని జగన్_ _గొప్ప యోధుడు YSR_ _బాధ్యత లేని చంద్రబాబు_ _ఎమ్మెల్సీ మేరిగ మురళి_
ప్రజలను నమ్మించే గారడీ విద్య చంద్రబాబుకు తెలుసు
-కుతంత్రాలు తెలియని జగన్
-గొప్ప యోధుడు YSR
-బాధ్యత లేని చంద్రబాబు
-ఎమ్మెల్సీ మేరిగ మురళి
వాకాడు లోని బాలకృష్ణ సేవా క్షేత్రంలో గురువారం బాబు షూరిటీ… మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మేరిగ మురళీధర్ పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా,వాకాడు లోని బాలకృష్ణ సేవా క్షేత్రంలో గురువారం జరిగిన బాబు షూరిటీ… మోసం గ్యారెంటీ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి మురళీధర్ పూల మూల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కరపత్రాలను ఆయన విడుదల చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…అమాయక ప్రజలను నమ్మించే గారడీ విద్య చంద్రబాబుకు బాగా తెలుసనీ అన్నారు, మన నాయకుడు జగన్ కు అలంటి కుతంత్రాలు తెలియవని, ఓటమినైనా హుందాగా స్వీకరించే రక్తం వై ఎస్ కుటుంబానిదన్నారు.అనంతరం వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, ఇతర నాయకులు మాట్లాడారు.