భాస్కరపురం గ్రామస్తులు_ _తీవ్ర వ్యతిరేకత_ _అభిప్రాయాలు సేకరించిన_ _సబ్ కలెక్టర్ పూజిత_
మైనింగ్ వల్ల పంటలు నాశనం అవుతాయి
-భాస్కరపురం గ్రామస్తులు
-తీవ్ర వ్యతిరేకత
-అభిప్రాయాలు సేకరించిన
-సబ్ కలెక్టర్ పూజిత
నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలం, భాస్కరపురం గ్రామంలో మైనింగ్ అనుమతుల కోసం పర్యావరణ ప్రభావాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ పూజిత పాల్గొన్నారు.
మైనింగ్‌కి అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తుల వ్యతిరేకత.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం భాస్కరపురం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 233/1లో మైనింగ్ అనుమతుల కోసం పర్యావరణ ప్రభావాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ పూజిత పాల్గొన్నారు. మొత్తం 16 హెక్టార్లలో మైనింగ్ చేపట్టేందుకు అనుమతి కోరగా, గ్రామస్థులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో మైనింగ్‌కి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. “ఈ మైనింగ్ వల్ల మేత, పంటలు నాశనం అవుతాయి, జీవనోపాధి కోల్పోతాం, మూగజీవాలకు మేత లేక ఇబ్బందులు వస్తాయి” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై వచ్చిన అభిప్రాయాలను సమగ్ర నివేదికగా తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు.