టైం…బాగుంది

పెద్ద ప్రమాదమే తప్పింది_ _ఆర్టీసీ బస్సుని నడుపుకుంటూ వెళ్లిన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి_ _అదుపులోకి తీసుకున్న ఆర్టీసీ అధికారులు_

టైం…బాగుంది

  • పెద్ద ప్రమాదమే తప్పింది
  • ఆర్టీసీ బస్సుని నడుపుకుంటూ వెళ్లిన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి
    -అదుపులోకి తీసుకున్న ఆర్టీసీ అధికారులు

ఓ మతిస్థిమితం లేని వ్యక్తి….ఆర్టీసీ బస్సును నడుపుకుంటూ వెళ్లిన ఘటన… నెల్లూరులో చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు, పోలీసుల వివరాల మేరకు… నెల్లూరు ఆర్టీసీ బస్సును మతిస్థిమితం లేని వ్యక్తి సుమారు 60 కిలోమీటర్ల డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు….బస్సును వెంబడించి….ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెం వద్ద బస్సు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి గా అధికారులు గుర్తించారు. అదృష్ట శావత్తు అసమయంలో ఎవరూ ఎదురు రాకపోవడంతో తప్పిన ఘోర ప్రమాదని అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బస్సుకి సంబంధించిన డ్రైవర్ ను అధికారులు అదుపులోకి తీసుకుని….బస్సును స్వాధీనం చేసుకొని డిపోకు తరలించారు. ఈ ఘటనపై డ్రైవర్ కండక్టర్లను పోలీసులు విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *