మంచులక్ష్మీ_ _స్మార్ట్ క్లాస్ రూమ్ పరిశీలన_ _నెల్లూరు లో 12 స్కూళ్ళు_
విద్య ప్రతి బిడ్డ హక్కు …
-మంచులక్ష్మీ
-స్మార్ట్ క్లాస్ రూమ్ పరిశీలన
- నెల్లూరు లో 12 స్కూళ్ళు
విద్య ప్రతి విద్యార్థి హక్కు అని టీచర్ ఫర్ ట్రస్ట్ చేంజ్ ఫౌండర్ మంచు లక్ష్మి అన్నారు. మంగళవారం ఆమె నెల్లూరు కోటమిట్ట లో ఉన్న మునిసిపల్ పాఠశాలను సందర్శించారు.
నెల్లూరు లో మా ట్రస్ట్ ద్వారా 12 స్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూములు ఏర్పాటు చేశామని , అన్ని స్కూళ్లలో పనులు పూర్తయ్యాయని టీచర్ ఫర్ ట్రస్ట్ చేంజ్ ఫౌండర్ మంచు లక్ష్మి తెలిపారు మంగళవారం ఆమె నెల్లూరు కోటమిట్టలో ఉన్న పురపాలక సంఘ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. భారత దేశం బహుభాషల సమ్మేళనమని, ఒక్క భాష నేర్చుకుని ఎలా ముందుకెళ్లగలమని ఆమె అన్నారు. తమ తాత, తండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే చదివారని, అందుకే ప్రభుత్వ బడుల్లో పిల్లలకు స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.