బాధితురాలు తనూజ_ _అదనపు ఎస్పీకి వినతిపత్రం_ _ఆగస్టు 1 నుంచి ప్రత్యక్ష పోరాటం_
అర్ధరాత్రి వేళల్లో వేధిస్తున్నారు…
-బాధితురాలు తనూజ
-అదనపు ఎస్పీకి వినతిపత్రం
- ఆగస్టు 1 నుంచి ప్రత్యక్ష పోరాటం
గత నాలుగు రోజులుగా నెల్లూరు లో సంచలనం రేపిన యాక్సిస్ బ్యాంకు కుంభకోణం బాధితులు మంగళవారం నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయం లోయానాదులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి పెంచలయ్య ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ ని కలసి న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేసారు.
యాక్సిస్ బ్యాంకు కుంభకోణం లో కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు, మంగళవారం నెల్లూరు ఎస్పీ కార్యాలయం లో అదనపు ఎస్పీ ని కలసి విచారణ జరిపి తమకి న్యాయం చేయాలనీ కోరారు. బాధితురాలు మోకా తనూజ , మాట్లాడుతూ… తాను రాజమండ్రి నుండి వచ్చానని , పోలీసులు పలు ప్రాంతాలనుండి ఫోన్ చేసి లోన్ బకాయిలు కట్టమని వేధిస్తున్నారని వాపోయింది.
ఈ స్కాం ఒక నెల్లూరు లోనే కాక చెన్నై తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జరిగిందని, యానాదులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి పెంచలయ్య అన్నారు. విచారణ సరిగా జరగడం లేదని , ఈ కుంభకోణ వెనుక బ్యాంకు అధికారుల ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తుందన్నారు . ఆగష్టు 1 నుండి నెల్లూరు లో ప్రత్యక్ష పోరాటానికి దిగితామని అయన తెలిపారు.కార్యక్రమంలో బాధితులు , పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.