నెరవేరిన కల_ -గ్రామస్తుల హర్షం_
ఎమ్మెల్యే చొరవతో వంతెన మంజూరు
-నెరవేరిన కల
-గ్రామస్తుల హర్షం
ఎన్నో ఏళ్లుగా వంతెన నిర్మించాలని కలలుగన్న గ్రామస్తుల కల నిజం కానుంది.కలిగిరి మండలం భట్టువారిపాలెం,గంగిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న వాగుకు ఎన్నో ఏళ్లుగా వంతెన నిర్మాణం కల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషితో సాకారమైంది.
కలిగిరి మండలం భట్టువారిపాలెం,గంగిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న వాగుపై వంతెన సమస్యను గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు అన్నారు…కొద్దిపాటి వర్షానికి ఆ వాగు ప్రవహిస్తూ రెండు గ్రామాల మధ్య రాకపోకలను ఆటంకమవుతుందని .బట్టువారిపాలెం నుండి అనేకమంది పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పనిమీద వింజమూరుకు వెళ్లే గ్రామస్తులు చాలా ఇబ్బందిగా ఎదుర్కొన్నారని గ్రామస్తులు తెలియజేశారు.ప్రస్తుత సర్పంచ్ మాధవ చొరవ తో, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వంతెన మంజూరు చేయించరాని తెలిపారు. కాంట్రాక్టర్ రమణారెడ్డి పనులను వేగవంతం చేసి, వంతెన పనులను ప్రారంభించడంతో ఆ గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.