మునిసిపల్ కార్మికులు_ _కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన_ _స్పష్టతలేని 124 జి ఓ_
మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం చేస్తాం …
- మునిసిపల్ కార్మికులు
- కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
-స్పష్టతలేని 124 జి ఓ
రాష్ట్రవ్యాప్తంగా గత పదిరోజులుగా జరుగుతున్నమునిసిపల్ కార్మికుల సమ్మె ఉదృత రూపం దాల్చింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో మంగళవారం కార్మికులు అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం జీతాలు పెంచామని జీవో నెంబర్ 124 విడుదల చేసిందని, అయితే పెంచిన జీతాలు ఎప్పటినుండి ఇస్తారో స్పష్టత ఇవ్వలేదని CITU నాయకులు అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెలో భాగంగా మంగళవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ లు తీర్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రియాజ్, లక్ష్మయ్య, ఫయాజ్, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.