అధిక కరెంటు బిల్లులు సవరించమని ఆదేశించిన కలెక్టర్

3 సెంట్ల భూమికి అరవై తొమ్మిది వేల కరెంటు బిల్లు_ _వెంటనే స్పందించిన కలెక్టర్_

అధిక కరెంటు బిల్లులు సవరించమని ఆదేశించిన కలెక్టర్

  • 63 సెంట్ల భూమికి అరవై తొమ్మిది వేల కరెంటు బిల్లు
    –వెంటనే స్పందించిన కలెక్టర్

కరెంట్ డిజిటల్ మీటర్లు అమర్చడం వల్ల కరెంటు బిల్లులు గతం కంటే నాలుగైదు రెట్లు అధికంగా వస్తున్నాయని, వాటిని కట్టలేక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బి ఎల్ శేఖర్ అన్నారు. సోమవారం ప్రజాసంఘాల ఐక్యవేదిక తరఫున నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు.

డిజిటల్ మీటర్ల వల్ల కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని , బిల్లులు చెల్లించలేక వినియోగదారులు దగ్గొలు పెడుతున్నాప్రభుత్వం స్పందించడం లేదని గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బి ఎల్ శేఖర్ అన్నారు. వరిసాగు లాభదాయకంగా లేకపోవడం తో బిల్ స్టాప్ లో పెట్టారు. 63 సెంట్ల చేపల గుంటకు 69 ,786 రూపాయలు చెల్లిస్తే నే సర్వీస్ క్రమబద్దీకరిస్తామని అధికారులు డిమాండ్ చేస్తున్నారని గిరిజన రైతు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఈ విషయమై కలెక్టర్ కి విన్నవిస్తే అయన APSPDCL SE ని పిలిపించి గిరిజన రైతులకు బిల్లులు సరిచేయాలని ఆదేశించారన్నారు. గతం లోఎవరైనా మరణిస్తే YSR భీమా పథకం ద్వారా అంత్యక్రియలకు 5000 అనంతరం లక్షా తొంభైవేల రూపాయలు ఇచ్చేవారని, అలాగే చంద్రన్న భీమా పునరుద్ధరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *