షాపులో రెండు బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన కిలేడీలు_
బంగారం కొంటామని చెప్పి…
-షాపులో రెండు బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన కిలేడీలు
ఇద్దరు మహిళలు బంగారం కొనుగోలు చేస్తామని చెప్పి…షాపు యజమాని వేరే పనిలో పెట్టి…షో కేసులో ఉన్న రెండు బంగారు గొలుసులను దొంగలించిన సంఘటన…తిరపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురంలో చోటు చేసుకుంది. బంగారం చోరీకి గురైందని తెలుసుకున్న షాపు యజమాని…నాగలాపురం సీఐకి ఫిర్యాదు చేశాడు. షాపులోని సీసీ పుటేజ్ ని పరిశీలించారు. తమకు బంగారం కావాలని యజమానిని నమ్మబలికించారు. దీంతో నిర్వాహకుడు వారి మాటను నమ్మి బంగారు నగలు చూపించాడు. అతనికి తెలియకుండానే షాపులోని షోకేసు లో పెట్టి ఉన్న రెండు బంగారు చైన్లను ఎంతో చాకచక్యంగా దోచేశారు ఈ కిలేడీలు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు మహిళలు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసుస్టేషన్ సమాచారం ఇవ్వాలని, అలాగే సీఐ సెల్ నెం. 9440900726 ఫోన్ చేయాలని కోరారు.