కాళహస్తిలో సుపరిపాలనలో తొలి అడుగు
ఇంటింటికెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించిన టీడీపీ నేతలు_
ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాం…
-కాళహస్తిలో సుపరిపాలనలో తొలి అడుగు
-ఇంటింటికెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించిన టీడీపీ నేతలు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి టిడిపి మండల అధ్యక్షులు అక్షింతల క్రిష్ణ యాదవ్, రంగినేని చెంచయ్య నాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వేడం ఎస్టి కాలనీ, అబ్బబట్లపల్లి, రామలింగాపురం గ్రామపంచాయతీలోని ఇంటింటికెళ్లి… ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలను పంపిణీ చేసిన సూపర్ సిక్స్ పథకాలను తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. రాష్ట్రం ఆర్ధిక లోటు బడ్జెట్లో ఉన్నా…సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న ఏకైక సీఎం చంద్రబాబునాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామేష్ యాదవ్, రమేష్, సుభాషిని,చరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు…