పనిభారం తగ్గించాలని వినతి_ _FRS ,బాల సంజీవని యాప్ లను రద్దు చేయాలని వినతి_
రాష్ట్రవ్యాప్త సమ్మెకు వెనుకాడం – అంగన్వాడీలు
-పనిభారం తగ్గించాలని వినతి
- FRS ,బాల సంజీవని యాప్ లను రద్దు చేయాలని వినతి
యాంకర్ పార్ట్: అంగన్వాడీలకు రావలసిన రాయతీలు అందించాలని, పనిభారం తగ్గించాలని కోరుతూ రాపూరు CDPO సునందకు అంగన్వాడీ వర్కర్లు వినతి పత్రం అందజేశారు. CITU ఆధ్వర్యంలో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల అంగన్వాడీల కార్యకర్తలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు,
వాయిస్ ఓవర్ : అంగన్వాడీలంటే ప్రభువానికి చులకన అని ICDS ప్రాజెక్ట్ అధ్యక్షురాలు జయసుధ అన్నారు. నెల్లూరు జిల్లా, రాపూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నందు రాపూరు సైదాపురం, కలువాయి , మండలాల అంగన్వాడి కార్యకర్తలు తమకు రావాల్సిన రాయితీలను అందించాలని , పని భారం పెంచే యాప్ తొలగించాలని CITU ఆధ్వర్యంలో సిడిపిఓ సునంద కు వినతి పత్రం అందజేశారు. . ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్షురాలు జయసుధ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా డిమాండ్లను నెరవేర్చలేదని, FRS ,బాల సంజీవని యాప్ ల వల్ల మాకు పని భారంతో బీపీలు షుగర్లు వస్తున్నాయని, అన్నారు. 2022లో ఇచ్చిన ఫోన్లు మొత్తం చెడిపోయాయని వాటితో ఎలా పనిచేయాలని ఆమె ప్రశ్నించారు. , అంగనవాడీలంటే ప్రభుత్వాలకు చులకన అని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడిలు సమ్మెకు వెనకాడబోమని తెలిపారు. . ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యదర్శి ప్రమీల, CITU యూనియన్ సభ్యులు ప్రసాద్, పెద్ద పెద్ద ఎత్తున అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.