ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటాం
ఈ ప్రాంత ప్రజలకు ఎంత చేసినా తక్కువే -ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కోడూరుపాడులో జడ్పీ హైస్కూల్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, గిరిధర్ రెడ్డి
ఒక్క ఫోన్ కాల్ చేయండి స్పందిస్తా…
- ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటాం
- ఈ ప్రాంత ప్రజలకు ఎంత చేసినా తక్కువే
-ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
-కోడూరుపాడులో జడ్పీ హైస్కూల్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, గిరిధర్ రెడ్డి
కోడూరుపాడులో జడ్పీ హైస్కూల్ భవనాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. కోడూరుపాడు ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఆదరించారని, వీరికి ఎంత చేసినా తక్కువేనని ఆయన చెప్పారు.
తెలిసిన నెంబరైనా…తెలియని నెంబరైనా…ఒక్క ఫోన్ కాల్ చేయండి వెంటనే స్పందిస్తానని…రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 1వ డివిజన్ నారాయణరెడ్డిపేటలో దోభీఘాట్, కోడూరుపాడులో జెడ్.పి. హై స్కూల్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డిలతో కలసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. శ్రీధర్ రెడ్డికి స్థానిక్ నాయకులు, కార్యకర్తలు గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రజల అభిమానంతో, కార్యకర్తల అండతోనే రాజకీయాలు చేస్తామన్నారు. గత మూడు ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఆదరించారని… ఈ ప్రాంత ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీ కుడుములు చిరంజీవి, కో క్లస్టర్ ఇంచార్జీ తంబి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.