పేదలకు కొండంత అండగా CMRF

ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి – లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పేదలకు కొండంత అండగా CMRF

  • ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
  • లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి చేశారు.

కోవూరు నియోజకవర్గ పరిధిలోని 32 మందికి 26 లక్షల 29 వేల 742 రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పంపిణి చేశారు.నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో బాధితులకు చెక్కులు అంజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 13 నెలల్లో ఇప్పటికి 13 సార్లు CMRF చెక్కులు పంపిణి చేసినట్లు తెలిపారు.అనారోగ్యం బారిన పడి ఆర్ధికంగా చితికి పోయి కష్టాలలో వున్న కుటుంబాలకు CMRFసహాయం కొండంత అండగా నిలుస్తుందన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 235 మంది అనారోగ్య పీడితులకు 2 కోట్ల 80 లక్షల 90 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందచేసి ఆదుకున్న సిఎం చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భముగా ఆమె ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇందుకూరు పేట, విడవలూరు, కొడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డి పాళెం మండలాలకు చెందిన టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *