MSME కింద పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం
పోటీతత్వం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపతాయి
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
గాండ్ల, తెలికుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
- MSME కింద పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం
- పోటీతత్వం పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపతాయి
- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, ప్రతి నిత్యం పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి సారించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని పరమేశ్వరీ కల్యాణ మండపంలో
గాండ్ల, తెలికుల కులస్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు.
గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు గ్రోసు సుబ్బారావుగారి సహకారంతో పదవతరగతి , ఇంటర్‌లలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు మాట్లాడుతూ. విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని ప్రోత్సహిస్తున్న సంఘ సభ్యులకు అభినందనలు తెలిపారు. గ్రోసు గోపాలయ్య తదనంతరం ఆయన కుమారుడు సుబ్బారావు అసోసియేషన్ తరఫున మంచి సేవలు అందిస్తున్నారని చెప్పారు. తనకు చదువు అంటే ఎంతో ఇష్టమని, అందుకే పేద పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేశామన్నారు.
గాండ్ల కులస్థుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు , నారా లోకేష్ కట్టుబడి ఉన్నారన్నారు.గాండ్ల, తెలికుల కులాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎంఎస్‌ఎంఈ కింద పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ..