ఆర్యవైశ్య సంఘం హర్షం -కావలిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు గొప్ప నిర్ణయం
- ఆర్యవైశ్య సంఘం హర్షం
-కావలిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
-కావలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుది గొప్ప నిర్ణయమని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు. కావలిలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.
విజయవాడలో శాఖమూరి పార్క్ నందు 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహస్థాపన 6.8 ఎకరాలలో
స్మృతివనంను ఏర్పాటు చేయనుండడం పట్ల కావలి ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్, మాజీ కౌన్సిలర్ అమరా యాదగిరి గుప్త, టిడిపి నాయకులు గాదం శెట్టి వేణు, టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావులు మాట్లాడారు. రాజధానిలో ఆహ్లాదకర వాతావరణంలో నిలువెత్తు పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకురావటం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు రాష్ట్రానికి చేసిన త్యాగాన్ని ఎవరు మరువకూడదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, పొట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.