అడ్డుగా గోడకట్టి దారి లేకుండా చేసారు
వాల్మీకి కాలనీ వాసులు
మాకు దారేది సారూ
అడ్డుగా గోడకట్టి దారి లేకుండా చేసారు
వాల్మీకి కాలనీ వాసులు
రోడ్డుకు అడ్డుగా గోడ కట్టడం వలన మాకు చాలా ఇబ్బంది గా ఉందని, పలుమార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదని సీతారామపురం మండలం వాల్మీకి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను తొలగించి తమకు దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
సీతారామపురం మండల కేంద్రంలోని వాల్మీకి కాలనీలో గత 40 సంవత్సరాలుగా 30 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఈ ఇళ్ల చుట్టూ ప్రధాన రహదారి మూసి వేయబడి ఉందని , తాము బయటకు వెళ్లాలంటే దారి లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్క దారి స్థానిక వైసిపి నాయకుడు రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం వలన మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు మీడియా ముందు వాపోయారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కనీసం ఇంటి నుండి గర్భిణీ స్త్రీలను, ఆరోగ్యం సరిగా లేనివారిని , చనిపోయిన వారిని, ఆ మార్గం ద్వారానే తీసుకొని వెళ్లాలని వారు ఆవేదన చెందుతున్నారు. దయచేసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చొరవ తీసుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను తీసేయాలని వారు ప్రాధేయపడుతున్నారు.