20 గ్రామాలకు త్రాగు,సాగునీటి సౌకర్యం
స్వర్ణముఖి దిగువ ప్రాంతాలకు జలాలు విడుదల
20 గ్రామాలకు త్రాగు,సాగునీటి సౌకర్యం
దిగువ ప్రాంతాలకు నీరు వదలడం వల్ల 20 గ్రాములు వరకు త్రాగునీటికి, సాగునీటికి కొరత ఉండదని గూడూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు.
తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న జలాలను వ్యవసాయం కొరకు కూటమి నాయకులు సుమారు 50 క్యూసిక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం గూడూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ … టిడిపి సీనియర్ నాయకులు దశరధరామిరెడ్డి మాట్లాడుతూ నిల్వ ఉన్న నీరుని తెలుగు ప్రాంతాలకు విడుదలకు సహకరించిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, టిడిపి సీనియర్ నాయకుడు దశరధరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.