అభ్యంతరాలుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా
అభివృద్ధికి అడ్డుకాదని రైతులనడం హర్షణీయం
ఆర్డీఓ నాగ సంతోషిని
శ్రీసిటీ పైప్లైన్ కు భూములిచ్చిన రైతులతో ఆర్డీఓ సమీక్ష
అభ్యంతరాలుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా -ఆర్డీఓ నాగ సంతోషిని
అభివృద్ధికి అడ్డ్డుకాదని రైతులనడం హర్షణీయం ఆర్డీఓ
కండలేరు నుంచి శ్రీ సిటీకి త్రాగునీటి పైప్ లైన్ కు రాపూర్ మండలంలో భూములు ఇచ్చే గిలకపాడు, వీరయ్యపాలెం గ్రామాల15 మంది రైతులతో నెల్లూరు ఆర్టీవో నాగ సంతోషిని అనూష సమావేశం అయ్యారు. నష్టపరిహారం పై రైతులతో ఆర్డీఓ సమీక్ష చేసారు.
శ్రీ సిటీ త్రాగునీటి పైప్ లైన్ కు భూములిచ్చిన రాపూరు మండలం గిలకపాడు, వీరయ్య పాలెం రైతులకు నష్టపరిహారం విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అన్నారు.నెల్లూరు జిల్లా రాపూరు తాసిల్దార్ కార్యాలయం నందు కండలేరు నుంచి శ్రీ సిటీ త్రాగునీటి పైప్ లైన్ కు రాపూర్ మండలంలో భూములు ఇచ్చే గిలకపాడు, వీరయ్యపాలెం గ్రామాల15 మంది రైతులతో నెల్లూరు ఆర్టీవో నాగ సంతోషిని అనూష సమావేశం అయ్యారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పైప్ లైన్ పోవు రాపూర్ మండలం లోని గిలకపాడు వీరయ్యపాలెం రైతులతో నష్టపరిహారం విచారణకు రావడం జరిగిందని, రైతుల ఆధార్, అడంగల్, రైతుల పైప్ లైన్ పై చెప్పే అభ్యంతరాలను పరిగణలో తీసుకొని జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తామని, పైప్ లైన్ కు కాంట్రాక్టర్ ఎటువంటి రక్షణ చర్యలను చేపడుతున్నాడనే విషయాన్నీ పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాపూరు ఎమ్మార్వో లక్ష్మీ నరసింహం, ఆర్ ఐ రవితేజ, వీఆర్వోలు రైతులు పాల్గొన్నారు.