జగన్ ఒక బ్రాండ్

అంతర్జాతీయ క్రెడిట్ సొంతం చేసుకున్నాడు

లిక్కర్ స్కామ్ లోబట్టబయలైన్న వైసీపీ నాయకుల వ్యవహారం

డమ్మాయపాలెంలో సోమిరెడ్డి హాట్ కామెంట్స్

జగన్ ఒక బ్రాండ్
అంతర్జాతీయ క్రెడిట్ సొంతం చేసుకున్నాడు
లిక్కర్ స్కామ్ లోబట్టబయలైన్న వైసీపీ నాయకుల వ్యవహారం.
డమ్మాయపాలెంలో సోమిరెడ్డి హాట్ కామెంట్స్

లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయ క్రెడిట్ వచ్చిందని….అవినీతి ఎలా చేయాలి అనేందుకు జగన్ ఒక బ్రాండ్ లా ఉన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ….ముత్తుకూరు మండలం డమ్మాయపాలెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టిడిపి నాయకులు పడాల నర్సారెడ్డి, వేల్పుల నాగార్జున తదితర టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను వారికి అందజేసిన సోమిరెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి గ్రామస్తుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చట్ట ప్రకారమే వైసీపీ నాయకులందరూ జైలుకు వెళ్తున్నారని చెప్పారు. పెన్షన్ తీసుకువచ్చింది టిడిపి అని… రెండుసార్లు గణనీయంగా పెంచి పంపిణీ చేస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మోడెం రామచంద్రారెడ్డి, అక్కయ్యగారి ఏడుకొండలు, ఇంగిలాల కోటేశ్వరరావు, షేక్ షఫీ ఉల్లా ,షేక్ అలిమత్తు ,మేకల సాయి కృష్ణ యాదవ్, పలువురు టిడిపి నాయకులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *