ఉన్నవి ధ్వంసం చేస్తే నిధులు దుర్వినియోగం
పారిశుధ్య సమస్యతో అంటువ్యాదులు గ్రామస్తుల ఆవేదన
కాలువలు లేని దగ్గర నిర్మించండి
ఉన్నవి ధ్వంసం చేస్తే నిధులు దుర్వినియోగం
పారిశుధ్య సమస్యతో అంటువ్యాదులు గ్రామస్తుల ఆవేదన
నెల్లూరు జిల్లా , విడవలూరు మండలం గాదెలదిన్నె గ్రామంలో బాగున్న డ్రైనేజీ కాలువలు పగలగొట్టి నూతన డ్రైనేజీలను నిర్మిస్తున్నారని గ్రామస్తులు అన్నారు. శనివారం వారు విలేకరుల ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామానికి మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించాలని , సైడ్ కాలవలు లేని చోట సైడ్ కాలువలు నిర్మిస్తే ఉపయోగం కానీ, ఇంతకుముందు ఉన్న కాలవల్లో ఇలాంటి పనులు చేయటం నిధుల దుర్వినియోగం అవుతుందని విడవలూరు మండలం గాదెలదిన్నె గ్రామస్తులు అన్నారు. ఈ విషయం గతంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి సైతం విన్నవించామన్నారు. కానీ ఇప్పుడు గ్రామానికి మంజూరు చేసిన నివేదికలో ఇరిగేషన్ కాలవ పరిధిలోని వర్కులు జరగాలని ఆర్డర్స్ రావటం సరికాదన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, సరైన సైడ్ కాలవలు లేక, సంబంధిత అధికారులు , సర్పంచ్ బ్లీచింగ్ కూడా చల్లకుండా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు.దీంతో గ్రామస్తులు మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.