సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటీ సమావేశం

పాల్గొన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి – వివిధ ప్రధాన అంశాలపై చర్చ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటీ సమావేశం

  • పాల్గొన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
  • వివిధ ప్రధాన అంశాలపై చర్చ


సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపైనా సీఎం చర్చించారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం త్తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్‌ , కింజారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ లు పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పాల్గొని సీఎం సూచనలు, సలహాలు తీసుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపైనా సీఎం చర్చించారు. పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు, పలువురు లోక్‌సభ, రాజసభ సభ్యులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *