ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలి
జాయింట్ కలెక్టర్ కార్తీక్ – కలెక్టరేట్లో తొలిసారిగా ప్రారంభమైన గ్రీవెన్స్ డే
ప్రతినెల మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే
- ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలి
- జాయింట్ కలెక్టర్ కార్తీక్
- కలెక్టరేట్లో తొలిసారిగా ప్రారంభమైన గ్రీవెన్స్ డే
నెల్లూరు కలెక్టరేట్ లో తొలి సారిగా ఉద్యోగుల గ్రీవెన్స్ డేని జేసీ కార్తీక్ నిర్వహించారు. పలు శాఖలకు చెందిన ఉద్యోగులు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో తొలిసారిగా నిర్వహించిన గ్రీవెన్స్ డే లో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, డిఆర్ఓ హుస్సేన్ సాహెబ్ పాల్గొని ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, సచివాలయాలు, ఇరిగేషన్, పంచాయతీరాజ్ మొదలైన శాఖలకు చెందిన ఉద్యోగులు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రధానంగా బదిలీలకు సంబంధించి ఎక్కువగా వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రతినెల మూడో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రీవెన్స్ డే లో ఉద్యోగులు అందించిన అర్జీలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సత్వరమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రీవెన్స్ డే కార్యక్రమానికి పలు సమస్యలపై సుమారు 124 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.