పంక్షన్ హాల్ హస్తగతానికే హత్య

ఉదయగిరిలో హత్య చేసిన నిందితులు అరెస్ట్

కావలిలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పీ శ్రీధర్

పంక్షన్ హాల్ హస్తగతానికే హత్య..!

ఉదయగిరిలో హత్య చేసిన నిందితులు అరెస్ట్

కావలిలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పీ శ్రీధర్

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఈ నెల 11వ తేదీన జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. గురువారం కావలిలో డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితులు గుంటుపల్లి మహ్మద్ హనీఫ్, గుంటుపల్లి మహ్మద్ ఉమర్ లను మీడియా ముందు చూపించారు. వీరు కొండాపురం మండలం వెంకటరంగాపురానికి చెందిన షేక్ హమీద్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారని తెలిపారు. వీరు హత్యకు ఉపాయించిన కత్తి, రాడ్డు, కారు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. హత్యకు గురైన షేక్ హమీద్ తో..హత్య చేసిన మహ్మద్ హనీఫ్, గుంటుపల్లి మహ్మద్ ఉమర్ లకు ఉదయగిరిలో భాగస్వామ్యంతో నిర్మించిన ఆల్ ఖైర్ పంక్షన్ హాల్ విషయంలో రెండు సంవత్సరాలుగా వివాదాలు నడుస్తున్నట్లు తెలిపారు. ఈ వివాదంపై హమీద్ కోర్టుకు కూడా వెళ్లాడన్నారు. 11వ తేదీన హమీద్ కొందరితో కలిసి వచ్చి పంక్షన్ హాల్ కు తాళాలు వేస్తుండగా హనీఫ్, ఉమర్ లు వచ్చి దారుణంగా హత్య చేశారన్నారు. హమీద్ ను అడ్డుతొలగించుకుంటే.. పంక్షన్ హాల్ హస్తగతం చేసుకోవచ్చన్న పన్నాగంతోనే హత్య చేశారని డిఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ వెంకటరావు, ఎస్సైలు ఇంద్రసేన రెడ్డి, శ్రీనివాసులు, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *