అవునా.. నన్ను మళ్లీ గెలిపించాలి

త్వ‌ర‌లో రైతుల‌కు అన్న‌దాత సుఖీభ‌వ‌

ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సు

ఇచ్చిన మాట నిలెబెట్టుకుంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు

బుచ్చిరెడ్డిపాళెం సుప‌రిపాల‌న‌లో తొలి అడుగులో ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి

పేద‌ల ప్ర‌భుత్వం.. మంచి ప్ర‌భుత్వం
త్వ‌ర‌లో రైతుల‌కు అన్న‌దాత సుఖీభ‌వ‌
ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సు
ఇచ్చిన మాట నిలెబెట్టుకుంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు
బుచ్చిరెడ్డిపాళెం సుప‌రిపాల‌న‌లో తొలి అడుగులో ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి

కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. బుచ్చిరెడ్డి పాళెం న‌గ‌ర పంచాయ‌తీలోని 13, 18 వార్డుల‌లో జ‌రిగిన సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఆయా వార్డుల్లోని ఇంటింటికి వెళ్లి.. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌పై క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేశారు. స్థానికుల‌తో మాట్లాడారు. ఏవైనా స‌మ‌స్య‌లున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆమె మాట్లాడారు. మన ప్ర‌భుత్వం.. పేద‌ల ప్ర‌భుత్వం.. అంద‌రికీ అందుబాటులో ఉండే ప్ర‌భుత్వం అన్నారు. ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన ప్ర‌తి మాట‌ను నిల‌బెట్టుకోవాల‌ని..ఎన్ని ఇబ్బందులున్నా.. వాటిని నెర‌వేర్చేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. ఈ 11నెల‌ల్లో సూప‌ర్ సిక్స్ హామీల‌లో 20 శాతం పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అలాగే.. త్వ‌ర‌లో రైతుల‌కు అన్న‌దాత సుఖీ భ‌వ ప‌థ‌కం అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంద‌ని.. వ‌చ్చే ఆగ‌స్టు 15 నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప‌థ‌కం కూడా అమ‌లు కానుంద‌న్నారు. కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌త్స్య‌కార భ‌రోసా, త‌ల్లికి వంద‌నం, పింఛ‌న్ల పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని.. ప‌ల్లెపండుగ కార్య‌క్ర‌మంలో భాగంగా బుచ్చితోపాటు అన్ని గ్రామాల్లో రోడ్లు నిర్మించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇంకా ప‌లు విష‌యాల‌ను ఆమె వెళ్ల‌డించారు. ఈకార్య‌క్ర‌మంలో.. ఛైర్‌ప‌ర్స‌న్ మోర్ల సుప్ర‌జ‌, ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు గుత్తా శ్రీ‌నివాసులు, కౌన్సిల‌ర్లు ల‌క్ష్మీకాంతమ్మ‌, వైష్ణ‌వి, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *