నిత్యవసర సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు
నాణ్యమైన ఇందనం
కొలతల ప్రకారం అందించాల్సిందే..!
నిత్యవసర సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు
పౌరులకు అందించే నిత్యావసర సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతల అసిస్టెంట్ కంట్రోలర్ ఈశ్వరరావు అన్నారు. మండలంలోని బసినేనిపల్లి, సీతారామపురం పెట్రోల్ బంకులను ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల కు నాణ్యమైన ఇంధనాన్ని కొలతల ప్రకారం అందించాలన్నారు. తూనికలు కొలతలు పరికరాల్లో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. వినియోగదారుల అనుమానాలను నివృత్తి చేయాడానికి పెట్రోల్ బంకులలో ఐదు లీటర్ల క్యాన్ ను అందుబాటులో ఉంచాలని పెట్రోల్ బంక్ నిర్వాహకులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.