కోవూరు ఎమ్మెల్యేపై ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య డిమాండ్
ప్రసన్నను అరెస్టు చేయాలి..!
కోవూరు ఎమ్మెల్యేపై ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య డిమాండ్
తిరుపతి జిల్లా.. డక్కిలి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో టీడీపి రాష్ట్ర కార్యదర్శి, వెంకటగిరి నియోజకవర్గం పరిశీలకులు జన్యు రమణయ్య మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడంతోనే ప్రజలు 11 సిట్లు ఇచ్చి బుద్ది చెప్పారన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫై యాభై వేల ఓట్లతో ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోవడం జీర్ణించుకోలేనే ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తూ.. రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఏపీ హైకోర్టు సైతం ప్రసన్నను తీవ్రంగా మందలించిందని.. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి తగిన బుద్ది చెప్పాలని ప్రజలు కోరుకుంటూన్నారని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు.