సూపర్ సిక్స్ అమలుకు కట్టబడి ఉన్న ప్రభుత్వం
త్వరలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
వరికుంటపాడులో సుపరిపాలనలో తొలి అడుగులో మంత్రి ఆనం
మంత్రి ఆనం, ఎమ్మెల్యే కాకర్లకు ఘన స్వాగతం పలికిన ప్రజలు
అభివృద్ధి..సంక్షేమానికి పెద్ద పీట..!
సూపర్ సిక్స్ అమలుకు కట్టబడి ఉన్న ప్రభుత్వం
త్వరలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
వరికుంటపాడులో సుపరిపాలనలో తొలి అడుగులో మంత్రి ఆనం
మంత్రి ఆనం, ఎమ్మెల్యే కాకర్లకు ఘన స్వాగతం పలికిన ప్రజలు
నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడులో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి ఆనం, ఎమ్మెల్యే కాకర్ల గ్రామంలోని ఇంటింటికీ వెళ్లారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది పాలనలో అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేశామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆరు పథకాలు విజయవంతంగా పూర్తవుతున్నాయన్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్, తల్లికి వందనం, దీపం కనెక్షన్ పథకాలను అమలు చేశామని వివరించారు. మరికొద్ది రోజుల్లో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మధుసూదన్, నాగిరెడ్డి, బాలగురువారెడ్డి, వెంకటరత్నం, మాలకొండ రాయుడు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.