కావలిలో మున్సిపల్ కార్మికుల సమ్మె
మున్సిపల్ కార్మికులకు 29 వేల వేతనాలు ఇవ్వాలి..
పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి..
కాంట్రాక్టు విధానానికి వెళితే సహించేది లేదు…
ప్రభుత్వానికి సీపీఎం నేతల పలు డిమాండ్లు, హెచ్చరికలు
కాంట్రాక్టర్ల కింద బానిసల్లా పనిచేయాలా…?
కావలిలో మున్సిపల్ కార్మికుల సమ్మె
మున్సిపల్ కార్మికులకు 29 వేల వేతనాలు ఇవ్వాలి..
పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలి..
కాంట్రాక్టు విధానానికి వెళితే సహించేది లేదు…
ప్రభుత్వానికి సీపీఎం నేతల పలు డిమాండ్లు, హెచ్చరికలు
ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు దిగారు.
కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. వీరికి
సిపిఎం నాయకులు మద్దతు పలికారు. సిపిఎం జిల్లా కార్యవర్గసభ్యులు ఏం.మోహన్ రావు N3 న్యూస్ తో మాట్లాడారు.
ఇంజనీర్ కార్మికులకు జివో నెంబర్ 36 ప్రకారం 2 వేల రూపాయలు జీతాలు చెల్లించాన్నారు. అదేవిధంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని తమ డిమాండ్ చేస్తుంటే.. వారని ఆప్కాస్
నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకురావాలని ప్రభుత్వం చూడడం దుర్మార్గచర్య అన్నారు. కార్మికులను కాంట్రాక్టు అప్పజెబితే కాంట్రాక్టర్ల కింద బానిసల్లా పనిచేయాలా అని ప్రశ్నించారు. వీరికి ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య , సీఐటీయూ కార్యదర్శి కృష్ణమోహన్, యూనియన్ నాయకులు తుర్కా శ్రీను ,మహేష్ తదితరులు ఉన్నారు.