అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి
అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే వీపీఆర్ లక్ష్యం
కోవూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
పేద ప్రజల ప్రభుత్వం..
తెలుగుదేశం ప్రభుత్వం..!
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి
అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే వీపీఆర్ లక్ష్యం
కోవూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురువారం కోవూరు మండల పరిధిలోని యన్.యస్.ఆర్ కాలనీ, నందలగుంట, పాటూరు పంచాయతీలలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. ఇంకొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ.. అభివృద్ధి.. సంక్షేమం.. రెండూ సమపాల్లో చేయగలుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని కొనియాడారు. పేద ప్రజలకు మంచి జరగాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని.. పేద ప్రజల ప్రభుత్వం.. టిడిపి ప్రభుత్వం అని పేర్కొన్నారు. విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం.. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యాసామాగ్రి అందిస్తున్నామన్నారు. పల్లెపండుగ కార్యక్రమంతో గ్రామాల్లో రోడ్లు వేయడం జరుగుతుందని.. నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఎంపీపీ పార్వతి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, గాదిరాజు అశోక్ కుమార్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.