దాడి చేసింది ఎవరు? దాడిలో ఇబ్బందులు పడింది ఎవరు.
పోలీసులు ఏమంటున్నారు ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు.
వడ్డిపాలెం ఘటనపై N3 న్యూస్ క్లియర్ రిపోర్ట్.
వడ్డిపాలెం లో అసలేం జరిగింది.
దాడి చేసింది ఎవరు? దాడిలో ఇబ్బందులు పడింది ఎవరు.
పోలీసులు ఏమంటున్నారు ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు.
వడ్డిపాలెం ఘటనపై N3 న్యూస్ క్లియర్ రిపోర్ట్.
నెల్లూరు జిల్లా…. ముత్తుకూరు మండలం… పిడతాపోలూరు పంచాయతీ పరిధిలోని కట్ట కింద వడ్డిపాలెం లో అసలేం జరిగింది….?దాడి చేసింది ఎవరు….? దాడి కారణంగా ఇబ్బందులు పడింది ఎవరు…..? బాధితులు ఏం చెబుతున్నారు ….పోలీసులు ఏమంటున్నారు….. దాడి చేసినట్లు ఆరోపిస్తున్న వారు ఏ వాదన వినిపిస్తున్నారు.వడ్డిపాలెం ఘటనపై పూర్తి వివరాలు ఈ కథనం లో చూడండి.
వారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు…. వారిలో కొందరు… ఒకరికి ఒకరు బంధువులు కూడా అవుతారు…. పండ్ల వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తు తమ పని తాము చేసుకుపోతుంటారు….అయితే సమస్య వస్తే…. వర్గాలుగా తయారవుతారు….. తమ ఆధిపత్యం గ్రామంలో చూపించుకునేందుకు సొంత మనుషులపై కూడా దాడి చేసేందుకు వెనుకాడబోరనేది….. గత వారం రోజులుగా వడ్డిపాలెం లో జరుగుతున్న దాడులు ప్రతి దాడులు తాలూకా సాక్ష్యాలు…. ముత్తుకూరు పోలీసులు చెబుతున్న వివరాల తాలూకా సారాంశం.
గతంలో వడ్డిపాలెం లో ఇరువర్గాల మధ్యన వరి ధాన్యం, మామిడిపండ్లు కొనుగోళ్లలో వివాదాలు ఉన్నాయి. జులై 11 వ తేదీ న రెండు వర్గాల మధ్య జరిగిన ఓ గొడవ కేసులో ….గ్రామంలో కొందరికి నోటీసులు పంపించిన పోలీసులు…. మరలా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పోలీస్ పికెట్ ముగిసిన మూడు రోజుల తర్వాత మళ్లీ వడ్డిపాలెం లో ఘర్షణలు చెలరేగాయి. గ్రామంలోని ఒక వర్గానికి చెందిన సుమారు 10 ఏళ్ల పై మరొక వర్గం వారు రాళ్లు కర్రలతో దాడికి తెగబడ్డారు. ఇంటి తలుపులు, ఇంటిపై రేకులు ఆటోలు బైకులు ఇలా ఏది దొరికితే వాటిని ధ్వంసం చేశారు…. అడ్డొచ్చిన కొంతమందిపై కూడా భౌతిక దాడులకు తెగపడగా…. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. రాళ్లు కర్రలతో వడ్డిపాలెం రోడ్లు నిండిపోయాయి అంటే దాడి ఏ రేంజ్ లో జరిగిందో ఇట్టే అర్థమవుతుంది. అయితే గతంలో చేసిన దాడికి ప్రతిదాడిగా కొందరు చెబుతుంటే…గ్రామంలో ఆధిపత్యం కోసమే ఈ వర్గపోరని న్యూట్రల్ గా ఉన్నవారు అంటున్నారు. ఏదేమైనాప్పటికీ క్షేత్రస్థాయిలో ఈరోజు చూస్తే పగిలిపోయిన ఇళ్ల తలుపులు… చెల్లాచెదురుగా పడిపోయిన బైకులు …. ధ్వంసం అయిన ఇంట్లో సామాగ్రి రాళ్ల దాడికి అర్ధాలు పగిలిన ఆటోలు…. గాయాలతో మనుషులు ఇది వడ్డిపాలెం లో పరిస్థితి. అయితే ఈ దాడిలో తప్పు ఎవరిది…. బాధ్యులు ఎవరో…. బాధితులు ఎవరు అనేది పోలీసులు నమోదు చేసే కేసుల ఆధారంగా త్వరలోనే తెలియనుంది….ఏదేమైనప్పటికీ దాడికి సంబంధించి ఒక్కొక్క వర్గం వారు ఒక్కొక్క వాదన వినిపిస్తున్నారు. పోలీసుల వాదన మాత్రం…. చిన్న గొడవలు చిలికి చిలికి పెద్దవిగా చేసుకొని దాడులు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే దాడి చేసిన వారు…. దాడిలో బాధితులు అయిన వారు ఇద్దరు…. ఒకే పార్టీకి చెందిన వారము అని చెప్పడం కోసం మెరుపు…..చూడాలి ….వడ్డిపాలెం వివాదం చివరికి ఏమలుపు తిరుగుతుందో చూడాలి మరి