నేరాల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ్‌

కొత్త‌గూడెం డెస్పీ హెచ్చ‌రిక‌

జూలూరుపాడులో కార్ట‌న్ సెర్చ్ నిర్వ‌హించిన పోలీసులు

నేరాల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ్‌
కొత్త‌గూడెం డెస్పీ హెచ్చ‌రిక‌

జూలూరుపాడులో కార్ట‌న్ సెర్చ్ నిర్వ‌హించిన పోలీసులు

అసాంఘిక కార్యాక‌ల‌పాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని కొత్త‌గూడెం డీఎస్పీ అబ్ధుల్ రెహ్మ‌న్ హెచ్చ‌రించారు. ఈమేర‌కు గురువారం ఉద‌యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో కొత్తగూడెం డి.ఎస్.పి అబ్దుల్ రెహ్మాన్, జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి, జూలూరుపాడు ఎస్సై రవి, చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ, అల్లిపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ లు కార్డన్ సెర్చ్ నిర్వ‌హించారు. ఆ ప్రాంతంలోని ఇళ్ల‌ను, వాహ‌నాల‌ను త‌నిఖీ చేశారు. ఈసంద‌ర్భంగా నిషేదిత మ‌త్తు ప‌దార్థాలు స్వాదీనం చేసుకున్నారు. ప‌త్రాలు లేని వాహ‌నాల‌ను సీజ్ చేశారు. ఈసంద‌ర్భంగా స్థానికుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఎవ‌రైనా అనుమానాస్ప‌దంగా త‌చ్చాడుతున్నా.. కొత్త‌గా వ‌చ్చిన వారిక క‌ద‌లిల‌క‌ల‌పై అనుమానాలున్నా.. వెంట‌నే స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని సీంద‌ర్భంగా డీఎస్పీ కోరారు. నేరాల‌కు, ఇత‌ర అసాంఘీక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ముఖ్యంగా యువ‌త మ‌త్తు ప‌దార్థాల‌కు దూరంగా ఉండాల‌ని ఈసంద‌ర్భంగా ఆయ‌న సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *