మీడియేషన్ ఫర్ ది నేషన్

సూళ్లూరుపేటలో అవగాహన ర్యాలీ

లోక్ అదాలత్ లో సివిల్, క్రిమినల్ కేసులను 90 రోజులలో పరిష్కరించుకోండి

జడ్జి సంయుక్త

మీడియేషన్ ఫర్ ది నేషన్..

  • సూళ్లూరుపేటలో అవగాహన ర్యాలీ
  • లోక్ అదాలత్ లో సివిల్, క్రిమినల్ కేసులను 90 రోజులలో పరిష్కరించుకోండి
  • జడ్జి సంయుక్త

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో “మీడియేషన్ ఫర్ ది నేషన్” నినాదాన్ని చాటిచెప్పేందుకు స్థానిక జడ్జి పి.సంయుక్త ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ సభ్యులు, పోలీస్ సిబ్బంది బుధవారం 1 km ర్యాలీ నిర్వహించారు. వినాయక గుడి సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రజలకు 90 రోజుల పాటు జరుగనున్న లోక్ అదాలత్ సేవలను వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే న్యాయవాదులు మాట్లాడుతూ… రాజీమార్గమే.. రాజమార్గం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రకృతి కుమార్, తిరుమురు సుధాకర్ రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు, పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్సై బ్రహ్మనాయుడు, దొరవారిసత్రం ఎస్ఐ అజయ్, తడ ఎస్సై కొండప్పనాయుడు, పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *