న్యాయం చేయాలంటూ హమిద్ కుటుంబ సభ్యులు ఆందోళన
ఉదయగిరిలో ఉద్రిక్తత…
- న్యాయం చేయాలంటూ హమిద్ కుటుంబ సభ్యులు ఆందోళన
నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్లో ఇటీవల హత్యకు గురైన హమిద్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. హత్య చేసిన వ్యక్తులను వెంటనే ఆరెస్ట్ చేసి… నిందుతులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేసారు. రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి ,అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అక్కడకు చేరుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని వారికి చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.