నిబంధనలు పాటిస్తూ పని చేయాలని సూచన
బిఎల్వోలకు శిక్షణ…
-నిబంధనలు పాటిస్తూ పని చేయాలని సూచన
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బిఎల్వోలు నిబంధనలు పాటిస్తూ పని చేయాలని డిప్యూటీ తాసిల్దార్ సందాని అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్ధానిక ఉపాధి హమీ కార్యలయంలో బిఎల్వోల విధులపై డిప్యూటీ తాసిల్దార్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్వోల విధులు ఓటర్ల చేర్పులు మార్పులపై మాస్టర్ ట్రైనర్ సలీం అవగాహన కల్పించారు. డిప్యూటీ తహశీల్దార్ సందాని మాట్లాడుతూ… ప్రతి ఇంటి ఇంటికి సర్వే నిర్వహించి ప్రతి ఇంటిలో వారి ఓటు హక్కులో ఎలాంటి తప్పులు ఉన్న వాటిని ఫారం 8 ద్వారా సరి చేయాలని కోరారు. ముఖ్యంగా ఫారం నెంబర్ 6, 7,8,పై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆరై సుభాని,మాస్టర్ ట్రైనర్ సలీం, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.