మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కొట్టే
జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కొట్టే
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సోంపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే జనసైనికుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని ఆ కుటుంబాన్ని ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఆర్ధిక సహయంగా 10 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు జనసేన పార్టీ అన్ని వేళలా అండగా నిలబతుందని తెలిపారు. అలాగే కుటుంబానికి జనసేన పార్టీ చేదోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.భవిష్యత్తులో కూడా మేలు చేయడంలో జనసేన ముందుంటుందని తెలిపారు.చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి,ఐదుగురు ఆడ బిడ్డల భవిష్యత్ కు సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర,మండల అధ్యక్షులు పాలిశెట్టి శ్రీనివాసులు,ఉదయగిరి మండల అధ్యక్షులు కల్లూరి సురేంద్ర రెడ్డి, వీర మహిళ సరిత ,జనసేన నాయకులు భాస్కర్, రమేష్, కిరణ్, సురేష్, ఆదమ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.