బోల్తా పడ్డ వాహనం_
చెట్టును ఢీకొట్టిన బొలేరో
బోల్తా పడ్డ వాహనం
నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజకవర్గం.. ఇందుకూరుపేట మండలం ఆదెమ్మ సత్రం.. పుల్లూరు రోడ్డు మధ్యలో బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి మైపాడు వెళ్తున్న ఓ బొలేరో వాహనం వేగంగా వెళ్లి.. రోడ్డు పక్కనున్న టెంకాయ చెట్టును ఢీకొంది. దాంతో ఆ వాహనం బోల్తా పడింది. ముందు భాగం బాగా దెబ్బతింది. అయితే.. అక్కడ డ్రైవర్ మాత్రం లేడు. ఆ వాహనం డ్రైవర్‌కు గాయాలేమైనా అయ్యాయా..? వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారా..? లేక ప్రమాదం జరిగిన వెంటనే పరార్ అయ్యాడా..? అనేది తెలియడంలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. ఇప్పటి వరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోకపోవడం విశేషం