_గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి
విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన మల్లికార్జున
స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలి .
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి.
విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన మల్లికార్జున
పంచాయతీలో ఎక్కువ శాతం జనాభా ఉన్న గిరిజనులకు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పైనాపురం గ్రామస్తుడు సురాయిపాలెం మల్లికార్జున డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా …ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలోని చిన్న సంఘం గిరిజన కాలనీలో స్థానిక గిరిజనులతో కలిసి మల్లికార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పరిశ్రమల నుంచి వచ్చే ఉప్పునీరు గిరిజనుల పొలాల్లోకి వచ్చి పంటలు పండడం లేదని తెలిపారు. కాలుష్యం కారణంగా అనేకమంది చర్మవ్యాధులతో బాధపడుతున్నారని పరిశ్రమల యజమానులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. పైనాపురం గ్రామం చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో గిరిజనులకు ఉపాధి కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడాలని మల్లికార్జున కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు నెల్లూరు ఈశ్వరమ్మ తుపాకుల శ్రీరాములు పట్రా పుట్టమ్మ, అక్కుల నాగమణి తదితరులు పాల్గొన్నారు