నోరు అదుపులో పెట్టుకో..!

ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డిపై మండిప‌డ్డ కోవూరు మైనారిటీ నేత‌లు_

ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డిపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాదని హిత‌వు

నోరు అదుపులో పెట్టుకో..!
ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డిపై మండిప‌డ్డ కోవూరు మైనారిటీ నేత‌లు

ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డిపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు స‌రికాదని హిత‌వు

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి.. కోవూరుని వివాద ర‌హిత‌, అవినీతి ర‌హిత నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుండ‌టం.. అభివృద్ధి చేయ‌డం జీర్ణించుకోలేక‌.. మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి త‌మ ఎమ్మెల్యేపై అస‌త్య ప్ర‌చారాల‌తోపాటు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం దారుణ‌మ‌ని.. ప‌ద్ద‌తి కాద‌ని.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గ మైనారిటీ నాయ‌కులు మండిప‌డ్డారు. ఈమేర‌కు వారు కోవూరులో మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకొని తిరిగే మీకు.. మహిళలతో ఎలా ప్రవర్తించాలో తెలియదా.. మహిళలని కించపరిచి నల్లపురెడ్డి కుటుంబానికి ఒక మాయ‌ని మచ్చలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. మా ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి.. నీ అవినీతిని ప్ర‌శ్నిస్తే.. నువ్వు మాత్రం వ్యక్తిగత దూషణలు చేయటం భావ్య‌మేనా అని ప్ర‌శ్నించారు. ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి ఇక‌నైనా నోరు అదుపులో పెట్టుకోవాల‌ని.. సూచించారు. కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌శాంతిరెడ్డి ముస్లీం సోద‌రుల‌ను అన్ని విధాలా ఆదుకుంటున్నార‌ని.. తామంతా ఆమెకు అండ‌గా.. తోడుగా ఉంటామ‌ని ఈసంద‌ర్భంగా వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *