ఆ గ్రామస్తులకు గొంతు ఎండుతుంది

భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నీటి లభ్యత లేక

జీవాలకు కూడా నీరు సరిపోక మత్యువాత పడుతున్నాయ_

పల్లె కన్నీరు పెడుతుంది

ఓ వైపు ఎక్స్ ప్రెస్ హైవేలు…మరో వైపు పోర్ట్ లు…ఇంకో వైపు ఎయిర్ పోర్ట్… ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అభివద్ధి.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఓ వైపు సంక్షేమంతో, మరో వైపు మౌలిక వసతుల కల్పనతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న నేటి తరుణంలో….. ఆ ప్రాంతం వాసులు కనీసం నిత్యావసరమైన తాగునీరు లేక అల్లాడుతున్నారు. గుక్కెడు నీటి కోసం, ఆర్తనాదాలు చేస్తున్నారు…భూగర్భ జలాల పూర్తిగా ఇంకిపోవడంతో… చేతి పంపుల్లో కూడా చుక్కనీరు రాక ఆ గ్రామస్తులకు గొంతు ఎండుతుంది. ఆ గ్రామం ఎక్కడ…వారి నీటి కష్టాలు తెలియాలంటే ఈ కథనాన్ని చూడండి….

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కిస్తీపురం పంచాయతీ పరిధిలోని చింతలపాలెం గ్రామంలో దాదాపుగా 200 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆ గ్రామం చుట్టూ ఏడు నీటి బోర్లు ఉండగా…భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నీటి లభ్యత లేక…గ్రామస్థులు ఇక్కట్లు పడుతున్నారు. గత రెండు నెలలు నుండి ఇలాంటి పరిస్థితులు నెలకొలడంతో గ్రామంలో కనీసం తాగేందుకు నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. పశువులు, జీవాలకు కూడా నీరు సరిపోక మత్యువాత పడుతున్నాయ…అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామానికి నీటి సౌకర్యాన్ని కల్పించాలని చింతలపాళెం గ్రామస్థులు వేడుకుంటున్నారు..

ఈ పరిస్థితిని ఎంపీడీవో దఈష్టికి తీసుకెళ్లగా…పరిశీలించి సత్వరం సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు…. ఈ కథనాన్ని చూసిన జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందన ఎలా ఉంటుందో..  చూద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *