విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకోవాలి – స్కూల్ కేబినెట్ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు
ఓవెల్ 14, విన్లైట్ లో నమూనా ఎన్నికల నగారా
- విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకోవాలి
- స్కూల్ కేబినెట్ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు
విద్యార్థినీ విద్యార్థులంతా విద్యార్ధి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకోవాలని ప్రిన్సిపాళ్లు రామాంజనేయులు, జగన్నాథలక్ష్మి లు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డులోని ఓవెల్ 14, ఓవెల్ విన్ లైట్ పాఠశాలలో కేబినెట్ ఎన్నికలను స్కూల్ యాజమాన్యం నిర్వహించింది. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు, ఎన్నికల విధి విధానాలను విద్యార్థులందరూ తప్పని సరిగా తెసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయులు తెలియజేశారు. సాధారణంగా జరిగే ఎన్నికల విధానాన్ని తలపించేలా పోలింగ్ బూత్ నమూనాలు, సీక్రెట్ ఓటింగ్, ఎన్నికల కమిషన్ విధి విధానాలు తదితర అంశాలు విద్యార్థులకు అర్ధమయ్యేలా ఈ ఎన్నికలను నిర్వహించారు. విద్యార్థులు కూడా ఈ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ప్రిన్సిపాళ్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో
విద్యా సంస్థల డైరెక్టర్ ఆర్ వేణు, సీఈవో ప్రమీల, జీఎం మహదేవయ్య, ఎన్నిక కన్వీనర్లు వినోద్, పవన్ కుమార్, చాముండేశ్వరి దేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.